కాంప్లెక్స్ అంటే రెండు అర్ధాలున్నాయి అనుకుంటా.. అంటే ఈ అనుకోవటం లో కూడా తికమక ఉంది.
అంటే తిక మక పెట్టేదే కాంప్లెక్స్ఆ ... ఏమో మరి అయ్యుండొచ్చు !!
అసలు కాంప్లెక్స్ అనేది ఎందుకు తికమక పెడ్తుంది...చక్కగా బోల్డన్ని గదులతో ఉండేది కాంప్లెక్స్ కదా .. అని అనుకుంటున్నారా ! అందులోనే మనం ( అంటే మనలాంటి అమాయకపు భర్తలన్నమాట ) 'complexity' లో పడిపోతున్నాం! కాంప్లెక్స్ అంటే కష్టతరం .. కష్టం అని నాకు కలిగిన అనుభవం నేర్పింది.
అడ వారంటే నే షాపింగ్ ప్రియులు. షాపింగ్ లో కూడా చాల రకాలున్నాయి. కొసరుకి 'కిటికీ షాపింగ్' ఇది అంత ప్రమాదకరం గా కనిపించకపోయినా తర్వాత కాలం లో మనం వెనుతిరిగి అర్రే ఈ కాంప్లెక్స్ కి ఇంతకుముదు ఎప్పుడుఐన వొచ్చామా అని కనీసం ఒక సారి తల గోక్కుని గుర్తు చేసుకునేలా చేస్తుంది.
![]() |
| నా కు నచ్చిన మల్లిక్ గారి కార్టూన్ |
సరే ఇంతకీ విషయం ఏంటంటే నేను నా శ్రీమతి షాపింగ్ కి వెళ్ళాల్సి వొచ్చింది.
నాకు కొంచెం విషయం తెలుసు.. ఎందుకంటే నేను నా కాలేజీ లో క్లాసు మేట్ అమ్మాయిలు షాపింగ్ వెళ్దామా అనగానే ఎగురుకుంటూ వెళ్ళేవాణి అప్పుడు పర్సుకు కాళ్ళు వొచ్చి జేబు లో నుంచి బయటకు గెంతి గంతులు వేసేది..సో ఆ పూర్వ అనుభవం తో నేను నా తెలివితేటలూ అన్ని వాడినా కానీ నా శ్రీమతి , కాలికి వేస్తె మేడకేసి - మెడకేస్తే కాలికేసి లాకొచ్చింది.
రైలు స్టేషన్ లో ముందు ప్రయాణికులు నడుస్తుంటే వెనక నడిచే "కూలి no1" లా రెండు చేతుల లో రెండేసి సంచులు వేసుకుని నా శ్రీమతి వెనక నడుస్తున్నాను.ఇలా నడుస్తూ టీవీ లో డైలి సీరియల్ లో హీరో లాగా మనసులో కర్చు లెక్కలు వేస్కుంటూ.. బలపం పోగొట్టుకున్న స్కూల్ పిల్లాడిలా నడుస్తుంటే .. ఉన్నట్టుండి నా శ్రీమతి చీర రంగు మారిపోయింది.. అర్రే ఇలా ఎలా జరిగింది.. అప్పటికీ నేను చెంగు పట్టుకునే నడుస్తున్నా కద అని చుస్తే తను తను కాదు!! "ఏయ్ మిస్టర్ నీకు అక్క ,చెల్లి లేదా" అని గుడ్లురిమి ఆమె ఫట్ మని తన చెంగు తను తీసుకుని వెళ్లి పోయింది. అరె మరి నా శ్రీమతి ఇలా ఎలా మారి పోయింది.. అని వెనక్కు చుస్తే ఇంకేముంది .. నా శ్రీమతి దూరంగా ఉన్న చీరల మధ్యలోంచి నావైపే కోపంగా చూస్తోంది..అరె ఆశ్చర్యం .. "నువ్వు అక్కడెలా ఉన్నావ్" అని అడిగితే .. సమాధానం చెప్పకుండా "నాకు తెల్సు మీరు ఇక్కడ ఎలా ఉన్నారో !!" అని విస విసా ఇంటికి అటో ఎక్కి వెళ్లి పోయింది.
సరే ఇవన్ని మోసుకుంటూ ఇంటికి వెళ్ళిన నాకు అసలుకు వడ్డీ లాగా అయిన బిల్లుకు తోడు ఉపవాసం తప్పలేదని చెప్పేదేముంది!

mee blog baagundi. kosamerupu kadhalla end avutunnaye. pratiroju kotta post kosam eduruchoostunnam.
ReplyDeletethanks Prakashgaru :)
ReplyDelete